Nivas News - తెలంగాణ / Nivas news : మహిళలు రాజకీయాలు చేయడం వల్లనే వారిపై రుద్ధబడిన సామాజిక బానిసత్వం నిర్మూలన జరుగుతుంది...... ---------బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్ బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిన CPIML మాస్ లైన్(ప్రజా పంథా) పార్టీ చర్ల మండల నాయకురాలు పూజారి సామ్రాజ్యం గారు బిసి, ఎస్సీ, ఎస్టీ మత మైనార్టీలు ఐక్యం కావాలి బహుజన రాజ్య స్థాపనకై కృషిచేయాల చర్ల మండలం కేంద్రం లో ఉన్న బీఎస్పీ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ చర్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు మండల ప్రధాన కార్యదర్శి కొండా కౌశిక్ గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ లో CPIML మాస్ లైన్(ప్రజా పంథా) పార్టీ చర్ల మండల నాయకురాలు పూజారి సామ్రాజ్యం గారు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరడం జరిగింది పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ గారు మొదటిగా పార్టీ కండువా కప్పి సామ్రాజ్యం గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సామ్రాజ్యం గారు పార్టీలోకి రావడం సంతోషకరమని అన్నారు బీఎస్పీ పార్టీలోకి రావాలని అనుకోవడం సామ్రాజ్యం గారి చైతన్యానికి నిదర్శనం అని అన్నారు మహిళలు రాజకీయాలు చేయడం వల్లనే వారిపై రుద్ధబడిన సామాజిక బానిసత్వం నిర్మూలన జరుగుతుంది ఆర్థిక స్వావలంబన సాధికారత నెరవేరాలంటే మహిళలు తప్పకుండా రాజకీయాలు చెయ్యాలని అందుకు బీఎస్పీ పార్టీ సరైన వేదికని అన్నారు ఈ కార్యక్రమం లో పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజక వర్గ అధ్యక్షుడు కొండా చరణ్ గారు నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ గారు నియోజక వర్గ కోశాధికారి కొప్పుల నారాయణగారు దుమ్ముగూడెం బీఎస్పీ మండల అధ్యక్షులు పాయం ప్రసాద్ గారు పార్టీ చర్ల మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు
Admin
Nivas News