Nivas News - తెలంగాణ / ఖమ్మం : ఎదులాపురం మున్సిపాలిటీ కి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి.ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ది:-20/1/2025 సోమవారం ఎదులాపురం స్మశాన వాటిక పక్కనే చెత్త డంపింగ్ ను స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంగా చెత్త ను డంప్ చేస్తూ ఆటుగా వెళ్తున్న రైతులకు మరియు అంత్యక్రియలకు వెళ్తున్న ప్రజలకు దుర్వాసన వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అక్కడ డంప్ చేసిన చేయడం ద్వారా పక్కన ఉన్నటువంటి ఎదులాపురం చెరువు లోని నిళ్ళు కలుషితమై ఆ నీళ్ళు తాగి పశువులు అనారోగ్యానికి గురై మరణించే అవకాశం ఉంది.ఈ యొక్క డంపింగ్ వలన నీళ్ళు కలుషితమై చెరువు లోని చేపలుచనిపోతున్నాయి.చెరువు మీద ఆధారపడిన మాత్యకార కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.అక్కడ డంప్ చేసిన చెత్త ను వేరే దగ్గరికి తరలించాలని స్థానిక రైతులు మరియు ప్రజలు కోరుతున్నారు.ఈ విషయమై ఖమ్మం రూరల్ ఎంపిడిఓ గారికి వేరే దగ్గర డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ అందజేశారు.వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి,కళ్లెం.శేష్ రెడ్డి, కొక్కు.రాజు,సత్తార్ తదితరులు పాల్గొన్నారు
Admin
Nivas News